- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
కురుస్తున్న భారీ వర్షాలకు జన్నారం మండలంలోని గ్రామాల్లో చాలావరకు విద్యుత్ దీపాలు చెడిపోయాయని ఆయా గ్రామాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్ అన్నారు. మంగళవారం మండలఎంపీడీఓ ఉమర్ షరీఫ్ కు సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. దసరా పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
- Advertisement -