– ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరెంటు కోత
హవానా : అమెరికా విధిస్తున్న ఆంక్షలతో క్యూబాలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవుతున్నది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా విద్యుత్ కోత ఏర్పడింది. సుమారు కోటి మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూబ్యా మొత్తం జనాభానే సుమారు కోటీ పదిలక్షలు. దేశంలో క్రమక్రమంగా సరఫరాను పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. రాజధాని హవానాలో 5 శాతం మందికి అంటే సుమారు 42 వేల మందికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని క్యూబా ఇంధన, గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం దేశ విద్యుత్ వ్యవస్థ ‘సంపూర్ణంగా డిస్‌కనెక్షన్’ అయిపోయిందని సోషల్‌మీడియాలో తెలిపింది. గ్రిడ్ కుప్పకూలినప్పుడు యూనిట్లలో ఎలాంటి వైఫల్యాలు లేవని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపింది. అలాగే, మరోవైపు విద్యుత్ పునరుద్ధరణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రిత్వ శాఖ విద్యుత్ డైరెక్టర్ లాజురో గెర్రా మీడియా ప్రతినిధులకు తెలిపారు. క్యూబాపై అమెరికా కొన్ని ఏళ్ల నుంచి ఆర్థిక, సోషల్ దిగ్భంధనాలను అమెరికా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల చమురు దిగ్భంధనాన్ని కూడా అమెరికా కఠినంగా అమలు చేస్తుంది. క్యూబా తన పెట్రోలియం అవసరాల్లో 40 శాతాన్ని మాత్రమే సొంతంగా ఉత్పత్తి చేసి తీర్చుకోగలుగుతోంది. అలాగే విద్యుత్‌ను కూడా సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నా.. దేశీయ అవసరాలకు అది సరిపోవడం లేదు. క్యూబా అధ్యక్షులు మిగ్యుల్ డియాజ్ కానెల్ గతవారంలో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ తమ ద్వీపానికి మూడు నెలలుగా చమురు సరపరా జరగడం, సౌర విద్యుత్, థర్మల్ ప్లాంట్లు, నేచరుల్‌గ్యాస్ ప్లాంట్లపైనే ఆధారపడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యూబాకు చమురు విక్రయించే లేదా సరఫరా చేసే ఏ దేశంపై అయినా సుంకాలు విధిస్తామని జనవరిలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయాన్ని డియాజ్ కానెల్ గుర్తు చేశారు. తమ విద్యుత్ కష్టాలకు అమెరికా విధించిన ఇంధన దిగ్భంధనమే కారణమని విమర్శించారు. గతేడాది డిసెంబర్ ప్రారంభంలో కూడా పశ్చిమ క్యూబాలో భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సోమవారం దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత నాలుగు నెలల్లో క్యూబాకు ఇది మూడో భారీ విద్యుత్ అంతరాయం. సోమవారం విద్యుత్ కోతతో దాదాపు పది వేల మందికి పైగా ప్రజలకు జరగాల్సిన శస్త్ర చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చిందని అధ్యక్షులు డియాజ్ కానెల్ తెలిపారు. విద్యుత్ సంక్షోభంతో క్యూబా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తమ ఆంక్షలు ఎత్తివేయాలంటే క్యూబా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, రాజకీయ, ఆర్థిక సరళీకరణ దిశగా క్యూబా పయనించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.
అమెరికా ఆంక్షలతో క్యూబాలో తీవ్రతరంగా విద్యుత్ సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



