బంధువుల ఇండ్లల్లోనూ తనిఖీలు
ఆస్తులపై కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
ఏడీఈ అంబేద్కర్ అరెస్టు
నవతెలంగాణ-మియాపూర్ / ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. విద్యుత్ శాఖ ఇబ్రహీం బాగ్ ఆపరేషన్స్ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) అంబేద్కర్ అక్రమా స్తులు దాదాపు 150 కోట్లకు పైనేనని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఏడీఈ ఆస్తులపై ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక సోదాల్లో విస్మయపరిచే అంశాలు వెలుగులోకొచ్చాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడీఈ అంబేద్కర్ అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్టుగా ఏసీబీకి సమాచారం అందింది. దీంతో ఏసీబీకి చెందిన 14 బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అంబేద్కర్ అక్రమాస్తులపై సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో శేరిలింగంపల్లిలో ఒక ఇల్లు, గచ్చిబౌలిలో జీ ప్లస్ ఫైవ్ భవనం బయటపడ్డాయి. అలాగే అమృస్తార్ కెమికల్స్ పేరిట పది ఎకరాల్లోని ఫార్మాసూటికల్స్ కంపెనీ కూడా అంబేద్కర్ పేరిట ఉన్నట్టు తేలింది. ఇక హైదరాబాద్ నగరంలోని పది ఓపెన్ ప్లాట్లు, నగర శివారులో పది ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంట్లో లక్షల రూపాయల విలువైన బంగారు నగలతో పాటు భారీ మొత్తంలో నగదు బయటపడింది.
అలాగే రెండు విలువైన వాహనాలతో పాటు నగర శివారుల్లోని అంబేద్కర్ బినామి నివాసంలో 2కోట్ల 18లక్షల రూపాయల నగదు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడింది.ఇవేకాక మరికొన్ని విలువైన ఆస్తులు కూడా అంబేద్కర్ కలిగినట్టుగా ఏసీబీకి సమాచారం అందడంతో అధికారులు వాటి కోసం ఆరాతీస్తున్నారు. ఇతని పేరిట బ్యాంకుల్లో ఉన్నటువంటి లాకర్లను కూడా తేరవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అంబేద్కర్‌పై నమోదు చేసి.. నిందితున్ని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీజీ విజయకుమార్ తెలిపారు. అంబేద్కర్ అక్రమాస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం 150కోట్లకుపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఇతర ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
విద్యుత్ శాఖ ఏడీఈ అక్రమాస్తులు రూ.150 కోట్లు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES