నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులకు డుమ్మా కొట్టి తాగుతు జల్సాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఆత్మకూరు (యం), మోత్కూర్, గుండాల మండలాల విద్యుత్ ఏఈ లు, మోత్కూర్ ఎడిఈ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా గురువారం విధులకు డుమ్మా కొట్టి చౌటుప్పల్ దగ్గరలోని సరళ మైసమ్మ దేవాలయం వద్ద విందులో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విద్యుత్ కాంట్రాక్టర్లు ఈ విందును ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయం లో మాత్రం భువనగిరి లో మీటింగ్ ఉందని చెప్పినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. భువనగిరి ఎస్ఈ కార్యాలయం లో సంప్రదిస్తే ఎలాంటి మీటింగ్ లేదని తెలిపారు. ఈ మూడు మండలాలకు సంబంధించిన విద్యుత్ అధికారులు నిత్యం ఇలాంటి జల్సా లకు వెళుతూ ఉంటారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విధులకు హాజరుకాని ఈ మూడు మండలాల మండల విద్యుత్ అధికారులకు ఫోన్లో సంప్రదించగా తాము విధులకు హాజరైన తర్వాతనే ఇక్కడికి వచ్చామంటూ మాట దాటేస్తున్నారు.