నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వజ్రఖండి గ్రామంలో మంగళవారం నాడు విద్యుత్తు నియంత్రిక కాలిపోవడంతో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగింది. దీపావళి పండుగ పూట ఉదయం నుండి గ్రామంలో విద్యుత్తు సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు అవస్థలు పడ్డారు. పండుగ పూట పాత కథనేనా అని విధంగా గ్రామంలో అందరి నోట పలికింది. ఇట్టి విషయం మాజీ సర్పంచ్ సంజీవ్ పటేల్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సమస్యను వివరించారు. టి విషయంపై స్పందించిన మాజీ సర్పంచ్ సంజీవ్ పటే ల్ వెంటనే విద్యుత్ అధికారులతో మొబైల్ ఫోన్ ద్వారా సంప్రదించారు. విద్యుత్తు అధికారులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిశీలించారు.
వెంటనే విద్యుత్ నియంత్రికను రిపేరు చేయడానికి ప్రైవేట్ వాహనంలో గ్రామస్తులు సహకారంతో తరలించడం జరిగింది. మొదటగా బిచ్కుంద తీసుకువెళ్లగా అక్కడ రిపేర్ చేసే వారు లేకపోవడంతో వెంటనే బాన్స్ వాడి కు తరలించారు. ఉదయం నుండి బాన్సువాడలోని నిరీక్షించి విద్యుత్ నియంత్రికాని రిపేరు చేయించుకుని తిరిగి గ్రామానికి రాత్రి 7:30 సమయంలో చేరుకోవడం జరిగింది. సంబంధిత సబ్ స్టేషన్ లో ఇదులు నిర్వహిస్తున్న ఏ ఎల్ ఎం పీర్ సింగ్ , సి ఎల్ ఎం గంగాధర్ సహకారంతో రాత్రికి రాత్రే గ్రామ ప్రజల సహకారంతో మాజీ సర్పంచ్ దగ్గరుండి విద్యుత్తు పునరుద్ధరణ చేయించారు.
మాజీ సర్పంచ్ చొరవతో వజ్రఖండిలో విద్యుత్ సమస్య పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES