నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవెన్’. సుందర్ సి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. రుచిర ఎంటర్టైన్మెంట్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ ఎన్.సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనెల 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ,’ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. వాళ్ల రియాక్షన్స్ చూసినప్పుడు నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈనెల 15న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌ని ప్లాన్ చేశాం. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి చూసి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు నేను అక్కడే నిల్చుని ఉంటాను ఒకవేళ మీకు సినిమా నచ్చకపోయి ఉంటే మీ టికెట్ ని వెనక్కి అడిగే హక్కు మీకు ఉంది. ఒకవేళ సమయం వధా అయిందని అనిపించినా ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉంటుంది. నేను చేసే కథలు, పాత్రలు బావుంటాయని ప్రేక్షకులు మొదట ినుంచి ప్రశంసిస్తున్నారు. ఆ గౌరవానికి రిటర్న్‌గా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమాని నిర్మాతలు ఎంతో ఫ్యాషన్‌తో తీశారు. ఆడియన్స్‌కి గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. నా కథే నా బలం. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. ఈ సినిమాలో ఉన్న యూనిక్ కాన్సెప్ట్‌ని ఇప్పటివరకు మీరు ఏ థ్రిల్లర్‌లో కూడా చూసి ఉండరు. ఒక 30 మినిట్స్ చాలా ఎమోషన్‌కి గురి అవుతారు. ఆ ఎమోషన్ ఆడియన్స్‌కి ఓ మంచి అనుభూతినిస్తుంది. మా ట్రైలర్‌ని లాంచ్ చేసిన కమల్ హాసన్‌కి ధన్యవాదాలు. ఆయన లాంచ్ చేయడంతో ట్రైలర్ చాలా అద్భుతమైన రీచ్‌తో వెళ్ళింది’ అని తెలిపారు.
పవర్‌ఫుల్ కథతో ‘ఎలెవెన్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES