Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి..

అర్హులైన మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి..

- Advertisement -

మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జయమ్మ…

నవ తెలంగాణ భువనగిరి కలెక్టరేట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం, ఆర్థిక సహాయం చేయుటకై “రేవంత్ అన్నకా సహారా – మిస్కీనో కే లియే”, “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన” రెండు ప్రధాన పథకాలకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి ఆన్ లైన్ పోర్టల్ https://tgobmms.cgg.gov.in ద్వారా ధరఖాస్తులను మైనార్టీ సత్యం శాఖ అధికారి జయమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాదారణ ఎలక్షన్స్ కోడ్ కారణంగా ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకునే ప్రక్రియ తేది.29.09.2025 నుండి నిలిపి వేయబడినది. పేద మైనారిటీ ధరఖాస్తుదారుల నుండి భారీ ‘అభ్యర్థన’ కారణంగా, వారు ప్రయోజనాలను పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెలంగాణ మైనారిటీ ఆర్థిక సంస్థ, హైదరాబాద్ తిరిగి పునః ప్రారంభించారు.

అర్హత కలిగిన మైనారిటీలు ఇట్టి పథకములను ఆన్ లైన్ ధరఖాస్తు ద్వారా తేది: 05.01.2026, @10.30 ఏ ఎం నుండి తేదీ: 10-01-2026 @11.59 పి ఎం లోగా ధరఖాస్తు చేసుకొని, అ దరఖాస్తు ఫారముతో పాటు సంబందిత పత్రములు మీ మండల ప్రజా పరిషత్ కార్యాలయములో సమర్పించగలరని ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, 5.00 గంటల లోగ దరఖాస్తు చేసుకోగలరని  తెలిపారు.  కలెక్టర్ కార్యాలయము రాయగిరి లో 9505640004 ను సంప్రదించ గలరని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -