Friday, March 6, 2026
E-PAPER
Homeబీజినెస్ట్రిలియనీర్‌ రేసులో ఎలన్‌ మస్క్‌..

ట్రిలియనీర్‌ రేసులో ఎలన్‌ మస్క్‌..

- Advertisement -

800 బిలియన్లకు చేరిన సంపద
వాషింగ్టన్‌ : ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలోన్‌ మస్క్‌ ఆధిపత్యం మరింత పెరిగింది. గత నెలలోనే మస్క్‌ సంపద 64 బిలియన్‌ డాలర్లు పెరిగి.. మొత్తం 800 బిలియన్లకు చేరిందని ఫోర్బ్స్‌ మార్చి 2026 రిపోర్ట్‌ వెల్లడించింది. ఈ మొత్తం భారత కరెన్సీలో రూ.73 లక్షల కోట్లకు సమానం కావడం విశేషం. 250.5 బిలియన్లతో గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ రెండో స్థానంలో నిలిచారు. లారీఫేజ్‌ కంటే మస్క్‌ సంపద ఏకంగా 500 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉండటం విశేషం. త్వరలో జరగబోయే స్పేస్‌ ఎక్స్‌ ఐపీఓతో మస్క్‌ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌ కావచ్చని అంచనా వేస్తున్నారు.

వాల్‌మార్ట్‌ వారసుడు రాబ్‌ వాల్టన్‌ కుటుంబం 145.9 బిలియన్ల సంపదతో 9వ స్థానానికి ఎగబాకగా, ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం వారెన్‌ బఫెట్‌ 10వ స్థానంలో కొనసాగుతున్నారు. జనవరిలో 10వ స్థానంలో ఉన్న స్టీవ్‌ బాల్మెర్‌ ప్రస్తుతం 12వ స్థానా నికి పడిపోయారు. కుబేరుల జాబితాలో మూడో స్థానంలో అల్బాబెట్‌ గ్రూపు సెర్గీ బ్రిన్‌, నాలుగో స్థానంలో అమెజాన్‌ జెఫ్‌ బెజోస్‌, ఐదో స్థానంలో మెటా అధిపతి మార్క్‌ జూకర్‌బర్గ్‌, ఆరో స్థానంలో ఒరాకిల్‌ లారీ ఎల్లిసన్‌, ఏడో స్థానంలో ఎన్విడియా జెన్సన్‌ హువాంగ్‌, 8వ స్థానంలో ఎల్‌విఎంహెచ్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ ఫ్యామిలీ ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -