Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఎలన్‌ మస్క్‌కు రూ.88 లక్షల కోట్ల జీతం..!

ఎలన్‌ మస్క్‌కు రూ.88 లక్షల కోట్ల జీతం..!

- Advertisement -

వాషింగ్టన్‌ : టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ముందుకు ఆ కంపెనీ కనీవినీ ఎరుగని జీతాన్ని ప్రతిపాదించింది. టెస్లాకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా ఉన్న మస్క్‌కు ఏకంగా ఏడాదికి లక్ష కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.88 లక్షల కోట్లు) విలువైన ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. అయితే దీనికి చాలా కఠినమైన షరతులను విధించింది. వాటిని అధిగమిస్తే ఈ ప్యాకేజీ పొందవచ్చని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్లా మార్కెట్‌ విలువ 1.03 ట్రిలియన్లుగా ఉండగా.. దీనిని 2 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలి. సంవత్సరానికి 2 కోట్ల వాహనాలు డెలివరీ చేయాలి. 10 లక్షల సెల్ఫ్‌ డ్రైవింగ్‌ రోబో టాక్సీలను ఉత్పత్తి చేయాలి. 10 లక్షల హ్యూమనాయిడ్‌ ఎఐ బాట్స్‌ రూపొందించాలి. టెస్లాలో మస్క్‌ కనీసం 7.5 సంవత్సరాలు కొనసాగాలి. సిఇఒ పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలని తదితర షరతులను విధించింది. ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్‌కు ఉంచనుందని తెలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad