Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల శిక్షణా తరగతుల ఈఎల్స్ మంజూరు చేయాలి

ఉపాధ్యాయుల శిక్షణా తరగతుల ఈఎల్స్ మంజూరు చేయాలి

- Advertisement -

డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లికుదురు మండలం రాజు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

నెల్లికుదురు మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గత వేసవి సెలవులలో జరిగిన శిక్షణ తరగతులకు హాజరైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని, డిటిఎఫ్ మండల అధ్యక్షుడు మండల రాజు డిమాండ్ చేసినట్లు తెలిపారు. సోమవారం ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ రాందాస్ కు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలలో  సెలవు దినాలు అయినటువంటి జనవరి 10, 11- 2026 రోజులలో ఎన్నికల రెండవ దఫా  విధులు నిర్వహించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్  సిసిఎల్ మంజూరు చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్  నెల్లికుదురు మండల శాఖ  పక్షాన మండల విద్యాశాఖ అధికారి రాందాస్ కి వినతి పత్రాన్ని అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్  సభ్యులు ఉపేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -