ఫౌండేషన్ డైరెక్టర్ ఇరుగుదిండ్ల అశోక్
నవతెలంగాణ-మర్రిగూడ
పేద విద్యార్థులకు ఈఎల్ వి ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ డైరెక్టర్ ఇరగదిండ్ల అశోక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన నిరుపేద వైద్య విద్యార్థి ఈద గిరి కి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కేంద్రానికి చెందిన ఈద గిరి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నీట్ ఫలితాలలో 377 ర్యాంక్ సాధించి ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ పొందాడు. కానీ అతనికి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజు కట్టడానికి సరైన ఆర్థిక స్తోమత లేదు.విషయం తెలుసుకున్న ఈఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ శుక్రవారం ఫౌండేషన్ డైరెక్టర్ ఇరగదిండ్ల అశోక్ ద్వారా రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఎంబిబిఎస్ పూర్తయ్యేంతవరకు తమ ఫౌండేషన్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఇది పేద విద్యార్థులకు సేవ చేయాలనే దృక్పథం తప్ప రాజకీయంగా లబ్ది పొందే కార్యక్రమం కాదని ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ తెలిపారు. విద్య, వైద్య విషయంలో ఫౌండేషన్ నిరుపేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయాన్ని అందించినందుకు వైద్య విద్యార్థి ఈదగిరి ఈ ఎల్ వి ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అయితగోని నరసింహ గౌడ్,పగడాల రఘు,గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు అండగా ఈఎల్వి ఫౌండేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



