Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర పరికరాలు

ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర పరికరాలు

- Advertisement -
  • అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
    ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో పరికరాల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, గాంధీ ఆస్పత్రి బ్రాండింగ్‌, శానిటేషన్‌, ఆపరేషన్‌ థియేటర్లు, పరికరాల వినియోగం, ఎన్సీడీ క్లినిక్‌ల పనితీరుపై ఆయన చర్చించారు. అత్యవసర పరికరాలు మరమ్మతులకు వస్తే వెంటనే రిపేర్‌ చేయించాలని మంత్రి ఆదేశించారు. ఎనిమిదేళ్లు దాటిన పరికరాలను స్క్రాప్‌ చేయాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులకు సీఎస్‌ఆర్‌ నిధులతో బిల్డింగ్‌ ను అందుబాటులోకి తెచ్చే విషయంపై సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ, కమిషనర్‌ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణింద్ర రెడ్డి, ఆరోగ్యశ్రీ సిఇవో ఉదరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -