Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేశంలో 11 ఏండ్లుగా ఎమర్జెన్సీ

దేశంలో 11 ఏండ్లుగా ఎమర్జెన్సీ

- Advertisement -

దీనిపై బీజేపీ నేతలు మాట్లాడరెందుకు? : టీపీసీసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలో 11 ఏండ్లుగా ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయనీ, దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఏండ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీపై బీజేపీ మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టో అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణలో పరిపాలన, పార్టీ కార్యకర్తల పనితీరు బాగుందని కితాబిచ్చారు. పార్టీ పదవుల్లో ఉన్నవారు ఆ హౌదాలను సద్వినియోగం చేసుకోవా లని కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సమర్థులకే పదవులు ఇవ్వాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు సూచించారు. పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దనీ, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలని దిశానిర్దేశం చేశారు. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. అగ్రకులాలకు సీఎం, బీసీకి పీసీసీ అధ్యక్షునిగా, క్యాబినెట్‌లో నలుగురు దళితులు, స్పీకర్‌గా మరో దళితునికి అవకాశమిచ్చిందని ఉదహరించారు. రాష్ట్రంలో మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కులగణన చేయడంలో విజయం సాధించినట్టు తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చాలా విజయాలు సాధించినట్టు చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నామని తెలిపారు. పార్టీ పదవులను తేలిగ్గా తీసుకోవద్దనీ, అవి రాజకీయాల్లో ఎదుగుదలకు ఉపయోగ పడతాయని అన్నారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కాబోతున్నాయనీ, నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -