– జిల్లాలోని విద్యార్థులకు రూ.90.36 లక్షలు విడుదల
– మిగిలిన నిధులు త్వరలో అందజేత
– జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్
నవతెలంగాణ – కామారెడ్డి : ఎమ్మిగ్రా పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద 2024 – 25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల బోధన యూనిట్లు, ఉపకార వేతనాల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తం 60 శాతం వాటా కింద రూ.90 లక్షల 36 వేల రూపాయలు రాష్ట్రం 40 శాతం వాటా కింద రూ.89 లక్షల 62 వేల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని జిల్లాలోని 2068 మంది విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైతే వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులు వివరాలు సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల ఈ – పాస్ లాగిన్‌లో అందుబాటులో ఉంటాయని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ ఆ ప్రకటనలో వెల్లడించారు.



