నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ కార్యాక్రమాల్ని సత్కరిస్తుంది. 2025 ఎమ్మీ అవార్డ్స్‌ను రెండు గాజా డాక్యుమెంటరీలు గెలుచుకున్నాయి. 53వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ వేడక కార్యక్రమం న్యూయార్క్ నగరంలో సోమవారం జరిగింది. గాజా వివాదంపై తీసిన రెండు డాక్యుమెంటరీలు ఈ ఎమ్మీ అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి. ఈ వేడుకకు కెల్లీ రిపా, మార్క్ కాన్సులోస్ హోస్ట్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ టెలివిజన్ కార్యాక్రమాల్లో అత్యుత్తమమైన వాటికి అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఐఎటిఎఎస్) వార్షిక అవార్డులు అందిస్తుంది. ఉత్తమ టివి సినిమాలు, షోలు వంటి 16 విభాగాలలో ఈ అవార్డుల్ని అందించడం జరుగుతుంది. యుకె, స్పెయిన్, జర్మనీ ఇతర దేశాలకు చెందిన వారు ఈ అవార్డులు దక్కించుకున్నారు. భారతీయ చిత్రం అమర్‌సింగ్ చమ్కిలా రెండు విభాగాలలో నామినేట్ అయింది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. అయితే ఈ చిత్రంలో నటించిన దిల్జిత్ దోసంజ్‌కి ఉత్తమ ప్రదర్శన అవార్డు దక్కింది.
రెండు గాజా డాక్యుమెంటరీలకు ఎమ్మీ అవార్డ్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



