రిలీజ్‌కి రెడీ
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటీవలే రీలీజైన్ టీజర్, సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ‘అర్జున్ చక్రవర్తి’ యాంథమ్ రిలీజ్ చేశారు. విఘ్నేష్ భాస్కరన్ ఈ సాంగ్‌ని పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. దీపక్ బ్లూ, బథ్వీవ్ సత్యకుమార్, విఘ్నేష్ పారు తమ ఎనర్జిటిక్ వోకల్స్ కట్టిపడేశారు. ఈ సాంగ్‌లో విజయరామరాజు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్న విజువల్స్, వండర్‌ఫుల్ లోకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సాంగ్ విన్న వెంటనే అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజరు, అజరు ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్రబృందం తెలిపింది.
ఈచిత్రానికి రచన- దర్శకత్వం: విక్రాంత్ రుద్ర, నిర్మాత: శ్రీని గుబ్బల, సహ నిర్మాత: ఈడే కష్ణ చైతన్య, సంగీతం: విఘ్నేష్ భాస్కరన్, సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకాటి, ఎడిటర్: ప్రదీప్ నందన్, ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్,
ఆడియోగ్రఫీ: అరవింద్ మీనన్, సాహిత్యం: కష్ణకాంత్, డైలాగ్స్ రైటర్: రవీంద్ర పుల్లె.
‘అర్జున్ చక్రవర్తి’
- Advertisement -
- Advertisement -