ప్రాధాన్యతనివ్వాలి
వేం నరేందర్‌రెడ్డికి టీఎస్‌పీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని టీఎస్‌పీటీఏ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డిని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, కార్యదర్శి ఆర్ రోహిత్‌నాయక్ మంగళవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయాలని తెలిపారు. భాషాపండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేసిన సందర్భంగా ప్రాథమిక ఉపాధ్యాయులకు చేసిన వాగ్ధానం మేరకు పది వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ఎన్‌సీఈఆర్టీ నోటిఫికేషన్ జారీ తేదీకి ముందు బీఈడీ అర్హతలతో నియమితులైన ఎస్జీటీలను కామన్ సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని సూచించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కొనసాగించాలని తెలిపారు. 472 జీవో ప్రకారం ఉర్దూ మాధ్యమం పాఠశాలల్లో ఉపాధ్యాయులను కేటాయించాలని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించొద్దని కోరారు. ఎంఈవో పోస్టులను ఏపీ తరహాలో అనుసరించిన విధానాన్ని అవలంభించి భర్తీ చేయాలని తెలిపారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమని వేం నరేందర్‌రెడ్డి స్పందించారని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగైన వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారులతో సమావేశాలను నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారని పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యలకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES