Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపరిశ్రమలలో ఉద్యోగులకు భద్రత కల్పించాలి

పరిశ్రమలలో ఉద్యోగులకు భద్రత కల్పించాలి

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ :
పరిశ్రమలలో ఉద్యోగుల భద్రత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో గురువారం ప్రమాదకర పరిశ్రమలు హజార్డస్ ఇండస్ట్రీస్ కెమికల్, ఫార్మా పై వివిధ భాగాల ఉన్నత స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రత ప్రమాణాలు పాటించకుండా కంపెనీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు భాద్యతగా భద్రత నియమ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలో జూన్ 30, 2025న జరిగిన భారీ పేలుడు ప్రమాదం అనంతరం, పరిశ్రమల్లో అమలులో ఉన్న భద్రతా ప్రమాణాలను పునఃపరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు చేపట్టే చర్యలపై చర్చించారు.

భద్రతా తనిఖీలు తెలంగాణ ప్రభుత్వం లేబర్, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీస్ విభాగం జారీ చేసిన జీ.ఓ.ఆర్ టి.ఎన్ ఓ. 331, తేదీ 04.08.2025 ప్రకారం, జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా తక్షణమే పరిశ్రమల తనిఖీలు చేపట్టలన్నారు. ఈ క్రమంలో పరిశ్రమలలో తనిఖీలు దశలవారీగా నిర్వహించబడతాయని మొదటి దశలో అన్ని రసాయన మరియు ఔషధ పరిశ్రమలను ఒక నెలలోపు సమగ్రంగా తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు క్రమం తప్పకుండా భద్రతా శిక్షణ మరియు మాక్ డ్రిల్లులు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు. కార్మికుల ప్రాణ భద్రత అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని ఏ పరిశ్రమ అయినా భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే, కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

ఈ తనిఖీల ద్వారా సురక్షితమైన పని వాతావరణం కల్పించి, పరిశ్రమల్లో సున్నా ప్రమాద లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. అంతకుముందు ఫ్యాక్టరిస్ డిప్యుటీ ఇన్స్ పెక్టర్ శ్రీదేవి సూర్యాపేట లోని సువెన్ ఫార్మా, పైప్ లైన్ ఇన్ఫ్రస్ట్రక్చర్ లిమిటెడ్, చివ్వేంలలోని రావుస్ ఫార్మా, నల్లబండగూడెం లోని ఫోరస్ ఫార్మా, కోదాడ లోని మేఘ గ్యాస్ లకు తనిఖీ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ కృష్ణ రెడ్డి, జి ఎం ఇండస్ట్రీస్ సీతారాం నాయక్, లేబర్ డిప్యూటీ కమిషనర్ అరుణ, బాయిలర్ ఇన్స్పెక్టర్ భీమారావు,ఇండస్ట్రీస్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad