- Advertisement -
– 18 ఏండ్ల తర్వాత తొలిసారి
– మంత్రి ఉత్తమ్‌కు ఇంజినీర్ల శుభాకాంక్షలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. దాదాపు 18 ఏండ్ల నిరీక్షణ అనంతరం 127 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు తొలిసారి ప్రమోషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. ఈనేపథ్యంలో గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇంజినీర్లంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి నాగరాజు, కోశాధికారి సంతోషరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. న
- Advertisement -