టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు ఖాజా షరీఫ్
నవతెలంగాణ-పాలకుర్తి
ఐక్యమత్యంతో ఉద్యోగులు హక్కులను సాధించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఖాజా షరీఫ్ అన్నారు. టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకుర్తి రైతు వేదికలో టీఎన్జీవోస్ పాలకుర్తి యూనిట్ అధ్యక్షులు బక్క మహేష్ అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండేల శ్రీనివాస్ తో కలిసి ఖాజా షరీఫ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులందరూ టీఎన్జీవోస్ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఎదురైనా టీఎన్జీవో సంఘం అండగా ఉంటుందని అన్నారు.
ఉద్యోగస్తులందరూ ఐకమత్గా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చునని తెలిపారు. ఉద్యోగస్తులందరి ఐక్యమత్యంతోనే జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ భవనం సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులు ప్రభాకర్, జిల్లా కోశాధికారి హాఫిజ్, నాగార్జున, శ్రీధర్ బాబు, రొండ్ల శ్రీనివాస్ రెడ్డి, శంకర్, మధు,స్వరూప, అరుణ, యూనిట్ కార్యదర్శి కాసర్ల రాజు, కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు కపిలవాయి వెంకటాచారి , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్, శివప్రసాద్ , నవీన్, యుగంధర్, చంద్రశేఖర్, సతీష్, పర్శరాములు, సంతోష్, రేణుక తో పటు వివిధ శాఖల ఉద్యోగస్తులు పాల్గొన్నారు.



