- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
ఈనెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సోమవారం పోస్టల్ బ్యాలెట్ ద్వార తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముధోల్ మండల అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్స్ లో తమ ఓటును వేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో పోస్టల్ బ్యాలెట్ ఇంచార్జి లు మల్లారెడ్డి ,రవీందర్ రెడ్డి, రామ్మోహన్ తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -



