7,299 ఎంఎస్‌ఎంఈల మూత
అహ్మదాబాద్ : దేశానికే మోడల్ గుజరాత్ అంటూ ప్రధాని మోడీ చెబుతుంటారు. అయితే ఆ రాష్ట్రం అన్నింటిలోనూ ఘోరంగా విఫలమవుతోంది. తాజాగా అక్కడ పారిశ్రామిక విధానం అట్టర్‌ప్లాఫ్ అని మరోమారు రుజువు అయ్యింది. బీజేపీ పాలిత ఈ రాష్ట్రంలో ఉపాధి సంక్షోభంలో పడింది. ముఖ్యంగా గుజరాత్‌లో ఉపాధి అవకాశాలు లేక ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) పూర్తిగా విఫలమైంది. సూరత్, నవసారి వంటి ప్రధాన జిల్లాల్లో 2024-25లో ఈ పథకానికి ఒక్క అప్లికేషన్ కూడా రాకపోవడం గమనార్హం. రాష్ట్రంలో గత ఐదేండ్లలో 7,269 చిన్న, మధ్య తరగతి సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయి. దీంతో 33,361 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
రాజ్యసభలో గుజరాత్ ఎంపీ నర్‌హరి అమిన్ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2020-21లో 19,654 పీఎంఈజీపీ అప్లికేషన్లు రాగా.. 2024-25లో 60 శాతం తగ్గి 7,793గా నమోదయ్యాయి. గిరిజన జిల్లాల్లో కూడా పరిస్థితి దయనీయంగా ఉంది. డాంగ్, మహిసాగర్‌లో 7, చోటా ఉదయపూర్‌లో 16, నర్మదాలో కేవలం 2 అప్లికేషన్లు మాత్రమే రావడం గమనార్హం. గుజరాత్ ప్రభుత్వం ఉపాధిపై గొప్ప ప్రకటనలు చేస్తుండగా.. ఈ పథకం వైఫల్యం ప్రభుత్వ వాగ్దానాలకు, క్షేత్ర స్థాయి వాస్తవానికి మధ్య భారీ అంతరాన్ని చూపిస్తోంది. ఈ పథకం పేరుకు మాత్రమే ఉపాధి కల్పన అని గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ హిరేన్ బ్యాంకర్ విమర్శించారు. ఉపాధి లేక గుజరాత్ యువతకు వలస పోవాల్సిన పరిస్థితి ఎదురుకానుందన్నారు.
గుజరాత్‌లో ఉపాధి సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES