Tuesday, December 23, 2025
E-PAPER
Homeఖమ్మంచేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి

చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి

- Advertisement -

గ్రామానికి ఆదాయం లక్ష్యం
సమాజానికి ఆరోగ్యం
మల్లాయిగూడెం చెరువుల్లో  చేప పిల్లల విడుదల
సర్పంచ్ సంగా వెంకటమ్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట

చేపలు పెంపకంతో మత్స్యకారులు కు ఉపాధి, గ్రామానికి ఆదాయం, సమాజానికి ఆరోగ్యం సమకూరుతుంది అని స్థానిక సర్పంచ్ సంగం వెంకటమ్మ అన్నారు.
మత్స్యశాఖ ఆద్వర్యంలో పంపిణి చేసిన 36 చేప పిల్లలను మండలంలోని మల్లాయిగూడెం పంచాయితి పరిధిలోని దిబ్బగూడెం, పండువారిగూడెం, కొండతోగు, మల్లాయిగూడెం లోని నాలుగు చెరువుల్లో మంగళవారం ఆమె విడుదల చేసారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో గ్రామీణాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది అన్నారు. గ్రామంలోని సహజ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మత్స్య శాఖ సహాకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన చేప పిల్లల విడుదల చేపట్టామని అన్నారు. కట్ల, రవ్వ (బొచ్చ, శిలావతి) వంటి నాణ్యమైన వేగంగా ఎదిగే చేప పిల్లలను ఎంపిక చేసి చెరువుల్లో వదిలామన్నారు. ఇవి రాబోయే నెలల్లో మంచి దిగుబడి ఇచ్చే అవకాశముందని మత్స్య నిపుణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుర్సం జ్యోతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు కోలా లక్ష్మినారాయణ, రాంబాబు, మొడియం రవి, దుర్గారావు, తుర్సం శ్రీను, మంగ రాజు, మల్లయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -