– మోర్తాడ్ ఎక్సైజ్ సీఐ గుండప్ప
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఈత మొక్కలను నాటి పెంచడం ద్వారా గౌడ కులస్తులకు భవిష్యత్తులో ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని మోర్తాడ్ ఎక్సైజ్ సీఐ గుండప్ప అన్నారు. మంగళవారం మండలంలోని ఉప్లూర్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈత మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గౌడ సంఘం సభ్యులతో కలిసి ఈత మొక్కలను నాటారు. అనంతరం గౌడ కులస్తులను ఉద్దేశించి మోర్తాడ్ ఎక్సైజ్ సీఐ గుండప్ప మాట్లాడుతూ.. వన మహోత్సవంలో భాగంగా నాటుతున్న ఈత మొక్కలను జాగ్రత్తగా సంరక్షించి కాపాడుకోవాలన్నారు.
నాలుగైదు సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడితే ఆ తర్వాత అవే చెట్లయి గౌడ కులాస్తులకు ఉపాధినిస్తాయన్నారు. తద్వారా గౌడ కులస్తులకు వాటిని గీసి కల్లు విక్రయించడం ద్వారా ఆర్థికంగా భరోసా లభిస్తుందని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని గౌడ సంఘం పెద్దలకు సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ మానస, గౌడ సంఘం పెద్ద మనుషులు హన్మండ్లు గౌడ్, వూట్నూర్ రవిగౌడ్, కొడిమ్యాల సత్య గౌడ్, అమరగొని సదాశివ్ గౌడ్, మాసం మధుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఈత మొక్కల పెంపకంతో గౌడ కులస్తులకు ఉపాధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES