Wednesday, July 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి హామీ ఏపీఓలకు జీతాలు చెల్లించాలి

ఉపాధి హామీ ఏపీఓలకు జీతాలు చెల్లించాలి

- Advertisement -

– మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఉపాధి హామీ ఏపీఓలకు వెంటనే జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి టి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మరోవైపు పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు రాక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -