నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురుగుల సావిత్ర కోటయ్య, పంచాయతీ కార్యదర్శి గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్, గ్రామ పెద్దలు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.



