Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఉపాధి హామీ పథకం.. పేదలకు బతుకు భరోసా

ఉపాధి హామీ పథకం.. పేదలకు బతుకు భరోసా

- Advertisement -

ఉపాధి హామీ పనుల పండగ ప్రారంభంలో పాయం, కలెక్టర్ జితిస్ వి.పాటిల్
నవతెలంగాణ – మణుగూరు
ఉపాధి హామీ పనులు పేద ప్రజలకు బతుకు భరోసాన్ని ఇస్తుందని, జీవన ఉపాధిని కల్పించే మహత్తర పథకం అని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం పరిధిలో పనుల పండుగ జాతర కార్యక్రమం భాగంగా రెండు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. మొదటిగా దమ్మక్కపేట గ్రామపంచాయతీ పరిధిలో పౌల్ట్రీ షెడ్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం చేపట్టటం జరిగింది.

ఈ కార్యక్రమానికి  పినపాక శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు  ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్  జితేష్. వి .పాటిల్ ఐఏఎస్  కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను పెంచారని  ఎంపీడీవో టీ  శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా తో గూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కు భూమి పూజ నిర్వహించబడిందన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని, సమిష్టిగా విజయవంతం చేశారు.

పనుల జాతర అంటే ఏమిటి

పనుల జాతర అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక. గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం, ఉపాధి హామీ పథకం  ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పనులను మరింత చురుకుగా అమలు చేయడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు నిర్వహించబడతాయన్నారు. మట్టిరోడ్లు, పశుగ్రాస పంటల అభివృద్ధి, వ్యవసాయానికి అనుకూలమైన చెరువులు, వాగులు, రోడ్లు, పౌల్ట్రీ షెడ్లు, కమ్యూనిటీ భవనాలు, శానిటరీ కాంప్లెక్స్ లాంటి పనులు చేపడతారు.ఇది ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబడుతుంది. ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని తమ గ్రామ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. అందువల్ల దీన్ని  పనుల జాతర గా పిలుస్తారు.ఈ జాతర ద్వారా ప్రతి గ్రామం అభివృద్ధి కేంద్రంగా మారడమే కాకుండా, ఉపాధి సృష్టి, సామాజిక ఐక్యత, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad