Monday, February 2, 2026
E-PAPER
Homeఖమ్మంఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి: సీఐటీయూ

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సీఐటీయూ మండల కన్వీనర్ గుగులోత్ నరేష్ కో కన్వీనర్ బోయినపల్లి వీరబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేట్ శక్తులకు, గ్రామీణ ధనిక వర్గాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వి బి జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005 కొనసాగించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే  బోనకల్ గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశంలో సోమవారం కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సీఐటీయూ బోనకల్ మండల కన్వీనర్ గూగుల్ నరేష్, బోయినపల్లి వీరబాబు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కూలీలతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం వల్ల కొన్ని లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. ఇటువంటి పథకాన్ని వ్యవసాయ కార్మికులకు దూరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిల అమలు చేసే ఉద్దేశం లేనట్లు కనపడుతుందన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణ కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉప్పర శ్రీను, సిహెచ్ బ్రహ్మం, షేక్ సుభాని, వి సీత, ఎం తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -