Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ సామాజిక తనిఖీ 

ఉపాధి హామీ సామాజిక తనిఖీ 

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్ )ఆర్మూర్  
మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉపాధి హామీ 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ మాట్లాడుతూ.. ఈ ప్రజా వేదికలో 2024.. 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలో జరిగినటువంటి పనులను ఆడిట్ చేశారు. కూలీలకు డబ్బులు సక్రమంగా చెల్లించారని, రిజిస్టర్లు గ్రామపంచాయతీలో సరైన విధంగా నిర్వర్తించాలని అన్నారు.

గత సంవత్సరంలో నాటిన మొక్కలు ఎక్కడైతే చనిపోయాయో వాటి ప్లేస్ లో కొత్త మొక్కలు నాటించాలని ఆదేశించారు. ఎకౌంటు ప్రాబ్లం వల్ల ఎవరికైతే డబ్బులు చెల్లించబడలేదు వారికి డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ ఆఫీసర్ నారాయణ, సోషల్ ఆడి ప్రోగ్రాం మేనేజర్ అశోక్, అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, ఎంపీడీవో బాలకిషన్, ఏపీఓ అశోక్, ఎస్ఆర్పి బాలు, టెక్నికల్ అసిస్టెంట్లు స్వరూప, శ్రీనివాస్, సుకేష్, కంప్యూటర్ ఆపరేటర్ రాము గౌడ్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -