Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: డీఆర్డీఓ నాగిరెడ్డి

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: డీఆర్డీఓ నాగిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని డీఆర్డీఓ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను ముమ్మరంగా చేపట్టాలని, నర్సరీ పనులను పూర్తిస్థాయిలో ముగించాలని అధికారులకు సూచించారు.

గ్రామాల్లో మంజూరైన పశువుల షెడ్‌లు,గొర్రెల షెడ్‌లు, నాడెప్ కంపోస్ట్ షెడ్‌లు, అజోలా యూనిట్లు కోళ్ల షెడ్‌లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, లబ్ధిదారులకు ఉపయోగపడేలా పనులు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, ఎంపీ ఓ  అనురాధ, ఏ ఈ ( ఆర్డబ్ల్యూఎస్ సుప్రియ) సుప్రియ, ఏపీఓ  అరుణ కుమారి, టి ఏ మానస, సి ఓ లక్ష్మి, సరళ, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -