Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు

మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా, ఆత్మకూరు బ్లాక్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజేఏ) పనులు ఊపందుకున్నాయి. మొత్తం 16 గ్రామ పంచాయతీల్లో 7,460 జాబ్ కార్డులు జారీ అయ్యాయి, వీటిలో 4,592 యాక్టివ్‌గా ఉన్నాయి. 12,900 కార్మికుల్లో 7,161 మంది యాక్టివ్ పని చేస్తున్నారు, 81,586 పనిదినాలు కేంద్ర బాధ్యతలో పూర్తయ్యాయని, మహిళల పని దినాల్లో శాతం 64.13%గా ఉండటం విశేషం. మొత్తం 774 పనులు (కొత్త+స్పిల్‌ఓవర్) చేపట్టగా, 678 ప్రగతిలో, 96 పూర్తి అయ్యాయి.

మొత్తం వ్యయం ₹461.03 లక్షలు, వేతనాలు ₹204.07 లక్షలు, మెటీరియల్‌/నైపుణ్య వేతనాలు ₹221.6 లక్షలు. గురువారం మండల 16 గ్రామాల్లో 529 మంది కూలీలు పనికి హాజరయ్యారు. ఫిబ్రవరి నేలలో మండల వ్యాప్తంగా సుమారు రెండు లక్షల రూపాయలు ఉపాధి కూలీల డబ్బులు వారి ఖాతాల్లో జమ కావల్సి ఉందని ఎపిఓ రాజిరెడ్డి తెలిపారు. ఈ పథకం గ్రామీణుల జీవనోపాధిని మెరుగుపరుస్తోందని అధికారులు చెప్పారు. మండల వ్యాప్తంగా గురువారం హౌజుబుజుర్గు గ్రామంలో అత్యధికంగా 89 మంది కూలీలు హాజరైనట్లు ఏపిఓ తెలిపారు.

కేంద్ర యాప్‌తో కూలీల ఇబ్బందులు
ఉపాధి హామీ పథకంలో కూలీల నమోదుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ కూలీలకు ఇబ్బంది కలిగిస్తోంది. పని ప్రారంభానికి ముందు ఒక ఫోటో, నాలుగు గంటల తర్వాత మరొక ఫోటో సహా ప్రతి కూలీ యాప్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేయాలి. సాంకేతిక, నెట్‌వర్క్ సమస్యల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు.‌. 100 మంది పనికొచ్చే కూలీల్లో 8 మంది ఆధార్ అప్‌డేట్ సమస్యతో ఫోటో క్యాప్చర్ కావట్లేదు, దీంతో కూళిలు పని కోల్పోతున్నారు. ఈ చర్యతో కూలీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -