Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ నిరుద్యోగ యువత ఉపాధికి భరోసా.!

ఎస్సీ నిరుద్యోగ యువత ఉపాధికి భరోసా.!

- Advertisement -

ఈ నెల 24 దరఖాస్తులకు చివరి తేదీ
నవతెలంగాణ – మల్హర్ రావు

షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం ఉపాధి పథకాల యూనిట్లు మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు రాయితీ కింద ఈవీ 2, ఈవీ 3 వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్, కంట్రోల్ యూనిట్లు అందిస్తోంది. ఇందులో భాగంగా మండలానికి కొన్ని యూనిట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి తెలిపారు. అర్హులైన యువతకు బ్యాంకుల సహకారంతో ఈ యూనిట్లు మంజూరు చేసి ఉపాధి కల్పించేలా అధికారులు ప్రోత్సహించనున్నారు. ఈ మేరకు ఈ నెల 24 వరకు అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులుస్వీకరిస్తున్నారు.

ఇవీ అర్హతలు
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఒక రాయితీ యూనిట్ పొందవచ్చు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. రవాణా పథ కాలకు 50 ఏళ్లలోపు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 60 సంవత్సరాలలోపు వయసున్న వారు అర్హులు. శిక్షణ పథకాలకు 18 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులు. యూనిట్లు పొందిన వారికి 90 శాతం రాయితీ,10 శాతం బ్యాంకు రుణాల ద్వారా అందిస్తారు.

దరఖాస్తు ఇలా..
అర్హులైన షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24  వరకు http://tgobmms.cgg.gov.in దరఖాస్తు చేయాలి. తర్వాత సంబంధిత పత్రాలను డౌన్ లోడ్ చేసుకొని గ్రామీణ ప్రాంతం వారు ఎంపీడిఓ కార్యాలయం, పట్టణవాసులు పురపాలక కార్యాలయంలో సమర్పించాలి.

కేటాయింపులు ఇలా..
ఈవీ ద్విచక్ర వాహనాలు,ఈవీ మూడుచక్రాల వాహనాలు,వ్యవసాయ సంబంధిత వాహనాలు, పరికరాలకు అవసరమైన ధ్రువపత్రాలు ఆధార్, రేషన్ కార్డులు, కుల, ఆదాయ, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, శాశ్వత (పాస్లకు), పట్టాదారు పుస్తకం (వ్యవసాయ పథకాలకు),బోరుబావిలో నీరు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం (సోలార్ యూనిటు), పాస్పోర్టు సైజ్ ఫొటోలు దరఖాస్తుకు జత చేయాలి.దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్ జతపర్చాలి.దివ్యాంగులకు 5 శాతం, మహిళలకు 33 శాతం కేటాయింపులు చేస్తారు.గడిచిన ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్, దళితబంధు పథకం కింద లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులు.

సద్వినియోగం చేసుకోవాలి: శ్రీరామూర్తి…ఇంఛార్జి ఎంపిడిఓ
ఎస్సీ నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎస్సీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందులో అనేకరకాల యూనిట్లు ఉన్నాయి. వీటిని సబ్సిడీల ద్వారా పొంది ఆర్థికంగా ముందుకు సాగాలి. దరఖాస్తుల ప్రక్రియ అనంతరం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -