డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
నవతెలంగాణ – మిరుదొడ్డి
పొరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమి పరిరక్షణకు దేశ వ్యాప్తంగా ఐక్య ఉద్యమం చేపట్టాలని నరేగ సంఘర్షణ మోర్చా జాతీయ సమావేశాలలో నిర్ణయించినట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. గత రెండు రోజులు గా న్యూఢిల్లీ సూర్జిత్ భవన్ లో నరేగ సంఘర్షణ మోర్చా అధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకం పరిరక్షణ పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉపాధి హమి పధకానికి కేంద్రప్రభుత్వం నిధులను తగ్గిస్తు ఉపాధి హమి పధకాన్ని ఎత్తివేతకు కుట్ర చెస్తుందన్నారు.నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్( ఎన్ యంయస్ ) ,అదార్ పెమెంట్ తదితర పద్దతుల పేరుతో పధకం అమలుకు కఠినమైన నిబంధనలను అమలు చెస్తుందన్నారు.
కోట్ల మంది కూలీల జాబ్ కార్డులను రద్దు చేస్తూ ఉపాధి హమి పని హక్కులను కాలరాస్తుందన్నారు.కూలీలకు వంద రోజుల పని దినాలు కల్పించడం లేదని,చెసిన పనికి వేతనాలను చెల్లించడం లేదన్నారు.ఉపాధి హమి చట్టం అమలులోకి వచ్చి 20 ఏండ్లు పూర్తవుతున్నందున ఉపాధి హమి పని హక్కుల పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చెపట్టాలని జాతీయ సదస్సు నిర్ణయించిందన్నారు.పని హక్కుల పరిరక్షణ పోరాటం లో రాజకీయ పార్టీలు, సంస్ధ లు భాగస్వామ్యం కావాలన్నారు.ఈ సదస్సు లో ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్ణాటక,రాజస్థాన్, పశ్చిమ బెంగాల్,ఉత్తర్ ప్రధేశ్ తదిత రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారని శంకర్ తెలిపారు. ఉపాధి హమి పరిరక్షించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ,కేంద్ర గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటికి నివెదిస్తామని శంకర్ తెలిపారు.
ఐక్య ఉద్యమాలతోనే ఉపాధి హమి పరిరక్షించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES