Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు ఈఎన్సీ అనిల్‌కుమార్‌ ఉద్యోగ విరమణ

రేపు ఈఎన్సీ అనిల్‌కుమార్‌ ఉద్యోగ విరమణ

- Advertisement -

– ఇప్పటికీ వెయిటింగ్‌లోనే
– పెన్షన్‌, జీతానికి ఇబ్బందే
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

నీటిపారుదల, ఆయకట్టు శాఖ ఈఏన్సీ(జనరల్‌)గా విధులు నిర్వర్తించిన జి అనిల్‌కుమార్‌ శుక్రవారం ఉద్యోగవిరమణ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ముద్ర పడ్డ, ఏసీబీకి చిక్కిన పలువురు అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారనే కారణంగా ప్రభుత్వం అనిల్‌కుమార్‌ను గత రెండు నెలల నుంచి పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయింటింగ్‌లో ఉంచింది. ఆయన ప్రస్తుతం ఎలాంటి విధులు నిర్వర్తించడం లేదు. పోస్టింగ్‌ కోసం తిరుగుతున్నా సర్కారులో స్పందన లేదని జలసౌధ వర్గాలు చెబుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో పిల్లర్‌ కుంగిన నేపథ్యంలో సర్కారు అనుమతి లేకుండానే ఇసుక, సిమెంట్‌తో నింపారనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. పోస్టింగ్‌ ఇవ్వలేదు. కాగా శుక్రవారం అనిల్‌కుమార్‌ పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వెయిటింగ్‌లో ఉండటంతో వేతనం రావడం లేదు. పదవీ విరమణకు ఒకటే రోజు మిగిలి ఉన్న కారణంగా ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకపోతే పెన్షన్‌, వెయింట్‌ కాలానికి జీతం కూడా అందే అవకాశం లేదని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. ఒక్కరోజులో రిటైరవుతున్న అనిల్‌కుమార్‌కు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని ఇంజినీర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -