No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంఎన్‌కౌంటర్‌ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి

ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి

- Advertisement -

– ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఈనెల 21న చత్తీస్‌గడ్‌ నారాయణపూర్‌ జిల్లా ఇంద్రావతి నది ఒడ్డున జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన 28 మంది మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందచేయాలని పలు ప్రజాసంఘా లు, పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటనలో పౌర హక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎమ్‌ నారాయణరావు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆజాద్‌, చంద్రమౌళి (దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం), అభినవ్‌ (కుల నిర్మూలన పోరాట సంఘం), భవాని (అమరుల బంధుమిత్రుల సంఘం), రాంబాబు (తెలంగాణ ప్రజా ఫ్రంట్‌), గాదె ఇన్నయ్య (భారత్‌ బచావో) పేర్కొన్నారు. నారాయణపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలు గుట్టలుగా పడిఉన్నాయనీ, కొన్ని మృతదేహాలను మాత్రమే ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసి కుటుంబాలకు అందజేశారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతల మృతదేహాలను ఇప్పటివరకు కుటుంబాలకు అందజేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగి ఐదు రోజులు గడిచినా, మృతదేహాలు కుళ్ళిపోయే స్థితిలో ఉన్నా, వాటిని కుటుంబసభ్యులకు అందచేయట్లేదని తెలిపారు. ప్రభుత్వాలు ఇంత కర్కశంగా వ్యవహరించడం సరికాదన్నారు. పోలీసులు మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్ళొద్దని కుటుంబసభ్యుల్ని భయపెట్టడం మానుకోవాలని పేర్కొన్నారు..

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad