- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్‌లోని అనారం, మర్రిమల్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులను సైనికులు హతమార్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురు నక్సల్స్ మృతదేహాలను, ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు.
- Advertisement -



