నవతెలంగాణ-హైదారాబాద్: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో మారణోమం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లను ఆపేయాలని వివిధ పౌరసంఘాలు, రాజకీయ పార్టీలు చెపుతున్నా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. నిన్న ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తోపాటు 26మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఘటనా ప్రాంతంలో ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, ఒక భార్మర్, వాకీ టాకీలు, క్యాంపింగ్ మెటీరియల్ వంటి వాటిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES