Wednesday, February 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జైషేకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. అనంతరం మిలిటెంట్లు పారిపోయారు. ఉదంపుర్‌ ప్రాంతంలోని గుహల్లో వారు ఉన్నట్టు సమాచారం అందడంతో మళ్లీ గాలింపు చేపట్టారు. గుహలో ఉన్న వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని.. వారిలో ఒకరు పాక్‌ వ్యక్తి కాగా మరొకరు స్థానిక వ్యక్తి అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -