- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు . ఆ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్ట్‌లు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, పారామిలిటరీ దళాలు మంగళవారం ఉదయం ఆపరేషన్ చేపట్టాయి. తొలుత కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ మొదలుకాగా.. తర్వాత షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. తాజా ఘటనతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు.
- Advertisement -