Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌..

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడు. మృతుడిని సిపిఐ(మావోయిస్టు) సభ్యుడిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలో భద్రతా దళాలు సోదాల సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని అన్నారు. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు మరణించినట్లు కొల్హాన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ మనోజ్‌ కౌశిక్‌ తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -