Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయంఝార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: శాంతి చ‌ర్చ‌ల ప్ర‌తిపాద‌న‌ను బేఖాత‌ర్ చేస్తు ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో అనేక మంది మావోయిష్టుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పొట్ట‌న‌బెట్టుకుంటుంది. వ‌చ్చే ఏడాది మార్చి 31క‌ల్లా మావోయిష్టుల ఏరివేతే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. తాజాగా ఝార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో ఇవాళ‌ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

బిషున్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేచ్కీ దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ఎదురుప‌డ్డారు. ఇరు వ‌ర్గాలు ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు లాలూ లోహ్రా, ఛోటూ ఓరాన్‌తో పాటు మరో క్రియాశీలక సభ్యుడు సుజీత్ ఓరాన్‌గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి కీలక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. లాలూ లోహ్రా వద్ద ఏకే-47 రైఫిల్‌తో పాటు మరిన్ని తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -