నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశా – చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గురువారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు నక్సలైట్‌లలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే మరణించారు. ఈ విషయాన్ని ఒడిశా పోలీసులు స్పష్టంచేశారు. గణేశ్ ఉయికే గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. మావోయిస్టుల బలం పెంచడం కోసం ఎంతో కృషిచేశారు. ఆయన తలపై రూ.1.1 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం అని అధికారులు తెలిపారు. మరోవైపు ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఒడిశాలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత గణేశ్ ఉయికే..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



