Friday, May 23, 2025
Homeరాష్ట్రీయంతుమ్రేల్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌

తుమ్రేల్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

మావోయిస్టు మృతి
ఓ జవాన్‌ మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-చర్ల

పచ్చని అడవుల్లో మళ్లీ రక్తపుటేరు పారింది. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తుమ్రేల్‌ దండకారణ్యంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక హార్డ్‌కోర్‌ మావోయిస్టు మృతి చెందారు. ఆ కాల్పుల్లో ఒక జవాన్‌ కూడా మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. సుక్మా, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రేల్‌ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిపై సమాచారం ఆధారంగా.. కోబ్రా, జిల్లా సుక్మా డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ల సంయుక్త పోలీసుల బృందానికి, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం నుంచి కాల్పులు కొనసాగాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో గాలింపు చేపట్టగా, ఇప్పటివరకు ఒక మావోయిస్టు మృతదేహం, ఆయుధాలు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -