దర్దేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ వెంకటేశం
విద్యార్థినీ, విద్యార్థులకు దాతల సహకారం
నవతెలంగాణ – పాలకుర్తి
విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు చేస్తున్న కృషి అభినందనీయమని దర్దేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కె వెంకటేశం అన్నారు. శుక్రవారం ధర్దేపల్లి ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత పాఠశాలలో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు రజిత విద్యార్థినీ విద్యార్థులకు పదివేల విలువచేసే టై, బెల్టు, ఐడి కార్డులను, దర్దేపల్లి గ్రామానికి చెందిన జలగం కృష్ణ 15 వేల విలువచేసే బ్రాస్ బ్యాండ్, చెత్తకుండీలను వేరువేరుగా వేరువేరుగా బహుకరించడంతో ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, విద్యార్థిని, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం దాతల సహకారాన్ని విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు.
ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తరహాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులకు టై, బెల్టు, ఐడి కార్డులను అందించి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సమన్వయంతో అభివృద్ధి చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దాతల సహకారం బొహదపడుతుందని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులకు చేయూతనందిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఉపాధ్యాయురాలు రజిత, దర్దేపల్లి గ్రామస్తులు కృష్ణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సుధాకర్, కె. శ్రీనివాస్, పాపయ్య, ఝాన్సీ, సోమమల్లయ్య, ఉప్పలయ్య, దేవగిరి సూర్యప్రకాష్, పోగు వెంకటనర్సయ్య, బి. నాగజ్యోతి, క్రిస్టోఫర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES