వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
మేడారంలో పరిసరాల పరిశీలన
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను ఎండోమెంట్స్ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అడ్వైజర్ గోవిందహరి అధికారులతో కలిసి గురువారం వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క -సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక ముక్కులు చెల్లించారు.
మొదట తులాభారం నిర్వహించి ఆమె నిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు శాల్వాలతో ఘనంగా సన్మానించి వనదేవతల ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మేడారంలో చిలకలగుట్ట, జంపన్న వాగు, గద్దెల ప్రాంగణం, క్యూలైన్లు, కన్నెపల్లిలో సారమ్మ ఆలయం మేడారంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరిగి పరిశీలించారు. 2026 జనవరి 28 నుండి జరిగే మహా జాతరకు అన్ని శాశ్వత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శించుకుని ప్రశాంతంగా వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థానిక తహసీల్దార్ జె సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి, సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డిఓ వెంకటేష్ సంబంధిత వివిధ శాఖల అధికారులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న ఎండోమెంట్ ప్రిన్సిపల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES