- Advertisement -
నవతెలంగాణ–మల్హార్ రావు.
తెలంగాణ సాంప్రదాయాలను, సంస్కృతికి ప్రతీకగా మొదరోజు ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు అన్ని గ్రామాల్లో నిర్వహించారు.మహిళలు తంగేడు,టేకు,గుమ్మడితోపాటు తీరొక్క రంగురంగుల పూలను తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు.అర్ధరాత్రి వరకు ఆడి బతుకమ్మలను తీసుకువెళ్లి చెరువు కట్టల వద్ద లేదా ఆ గ్రామ బొడ్రాయి వద్దా లేదా గుడి ఆవరణలో వేశారు.అనంతరం కోలాటాలు,ఆటపాటలతో హంగామా చేశారు.
- Advertisement -