– ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల
– విద్యుత్ శాఖ ఉద్యోగుల నివాళులు
నవతెలంగాణ – ఖమ్మం
ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీలోని టేకులపల్లి గోశాల వద్ద గురువారం రాత్రి కుక్కలు వెంట పడటంతో విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ మృతిచెందారు. పోలీసులు, స్థానికులు, తోటి ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ శాఖలోని చింతకాని సెక్షన్‌లో పులకాని సందీప్ రెడ్డి (30) సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో భాగంగా గురువారం రాత్రి విధులు ముగించుకొని చింతకాని నుంచి ఖానాపురం హవేలీలోని మావో నగర్‌లో ఉన్న తన స్వగృహానికి స్కూటీపై వెళుతున్నారు. ఈ క్రమంలో టేకులపల్లి గోశాల సమీపంలోకి రాగానే కుక్కలు ఒక్కసారిగా తన వాహనం వెంటపడ్డాయి. ఆందోళనతో స్కూటీ వేగాన్ని మరింత పెంచాడు. ఈ క్రమంలో వాహనం ఒక్కసారిగా స్కిడ్ అయింది. తల సీసీ రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అక్కడున్న స్థానికులు స్పందించి 108కు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న సందీప్ తన భార్య లాస్యకు ఫోన్ చేయటంతో.. స్థానికులు మాట్లాడి విషయం చెప్పారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతన్ని ముందుగా ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు.. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్ మృతదేహానికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువ ఇంజనీర్ సందీప్ మృతి విషయం తెలిసి విద్యుత్ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైరా, ఖమ్మం టౌన్ డీఈలు రమేష్, నంబూరి రామారావు, చింతకాని ఏఈ శ్రీధర్, డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ నాగమల్లేశ్వరరావు, మాజీ ప్రెసిడెంట్ చల్లా రఘోత్తంరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సబ్ ఇంజనీర్లు నివాళి అర్పించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్పొరేటర్ నాగండ్ల కోటి నివాళులు అర్పించారు. సందీప్‌కు భార్య లాస్య, ఏడాదిన్నర వయస్సున్న కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి వెంకట్ రెడ్డి సైతం విద్యుత్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు.
కుక్కలు వెంటబడటంతో ప్రమాదం.. ఇంజనీర్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



