Monday, September 29, 2025
E-PAPER
Homeఆటలుక్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ పేసర్..

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ పేసర్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన పదిహేనేళ్ల సుదర్ఘీ కెరీర్‌కు సోమవారం అల్విదా చెప్పేశాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందే గాయం నుంచి కోలుకున్న వోక్స్ … మరోసారి గాయపడడంతో కెరీర్‌ ప్రమాదంలో పడింది. ఓవల్ టెస్టులో ఎడమ భుజం పక్కకు జరగడంతో యాషెస్ సిరీస్‌లో ఆడాలనుకున్న అతడి కల చెదిరింది. దాంతోగాయాలతో వేగలేకనే ఆటకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
62 మ్యాచుల్లో 192 వికెట్లు
ఆస్ట్రేలియాపై 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పీడ్‌స్టర్ 62 మ్యాచుల్లో 192 వికెట్లు తీశాడు. విదేశాల్లో కంటే స్వదేశంలోనే ప్రమాదకరమైన బౌలర్‌గా ముద్ర పడిన వోక్స్ ఇంగ్లండ్ గడ్డపైనే 23.47 సగటుతో 148 వికెట్లు పడగొట్టాడు.ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, సెంచరీతో ‘లార్డ్స్ హానర్స్ బోర్డు’లోకి ఎక్కాడీ లెజెండరీ బౌలర్. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో వోక్స్ సభ్యుడు. జోస్ బట్లర్ నేతృత్వంలో పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలిచాడీ పేసర్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -