నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలకు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్ సిగ్గుపడే భాష కాదు అని, అది సాధికారతను కల్పించే భాష అన్నారు. ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఆ భాషను పేద పిల్లలు నేర్చుకోకుండా చేస్తోందని, ఎందుకంటే ప్రశ్నించడం వాళ్లకు ఇష్టం ఉండదని, సమానత్వాన్ని వాళ్లు కోరుకోవడం లేదని రాహుల్ అన్నారు. తన ఎక్స్ అకౌంట్‌లో హిందీ భాషలో రాహుల్ గాంధీ ఇవాళ ఓ పోస్టు చేశారు. ఇంగ్లీష్ భాష ఆనకట్ట కాదు అని, అదో వారధి అన్నారు.
ఇంగ్లీష్ నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు అని, అది సాధికారత ఇస్తుందన్నారు. ఇంగ్లీష్ గొలుసు కాదు అని, అది గొలసుల్ని బ్రేక్ చేసే పరికరం అన్నారు. భారత దేశ పేద ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవద్దన్న ఆలోచనలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. మాతృభాష తరహాలోనే ఇంగ్లీష్ భాష ముఖ్యమైందని, ఎందుకంటే అది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుందన్నారు. ప్రతి భారతీయ భాషకు ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉన్నాయని, వాటిని ఆదరించాలని, అదే సమయంలో ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పాలన్నారు.
ఇంగ్లిష్ అడ్డంకి కాదు.. అనుసంధానకర్త: రాహుల్‌గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES