మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2021-2022 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించినప్పటికీ ఆ వాతావరణం కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పరిస్థితులు కనిపించడం లేదని తల్లిదండ్రులు తెలియజేసినట్టు తెలంగాణ విద్యా కమిషన్‌లో పేర్కొన్నదని తెలిపారు. దీనిని అధిగమించేందుకు టీఎస్ యూటీఎఫ్, తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం పెట్టామని, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆంగ్లంలో సులభంగా మాట్లాడటం, బోధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీని అభినందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ బోధకులు బికె.రెడ్డి మాట్లాడుతూ.. మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్ పద్ధతి ద్వారా ఇంగ్లీష్ భాషలో సులభంగా మాట్లాడొచ్చని, భాషను మైండ్‌కు అనుసంధానం చేయడం ద్వారా పట్టు సాధించొచ్చని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు నర్రా శేఖర్‌రెడ్డి, పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రెడ్ల సైదులు, కార్యదర్శులు గేర నర్సింహ, రమాదేవి, నలపరాజు వెంకన్న, మధుసూదన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై పట్టు పెరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES